Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ మహిళకు దక్కిన అదృష్టం: వేరుశనగ తీస్తుండగా దొరికిన వజ్రం

కర్నూల్ జిల్లాలో వ్యవసాయ పొలంలో వజ్రం దొరికింది. వేరుశనగ తీస్తున్న మహిళకు వజ్రం దొరికింది. దీని విలువ సుమారు కోటి రూపాయాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Andhra pradesh woman strikes Rs crore diamond in field lns
Author
Kurnool, First Published Oct 21, 2020, 11:19 AM IST

కర్నూల్: కర్నూల్ జిల్లాలో వ్యవసాయ పొలంలో వజ్రం దొరికింది. వేరుశనగ తీస్తున్న మహిళకు వజ్రం దొరికింది. దీని విలువ సుమారు కోటి రూపాయాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

జిల్లాలోని తుగ్గలి మండలంలో వర్షాకాలంలో వజ్రాల కోసం అన్వేషణ సాగుతోంది. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు.

also read:రాయి అనుకొంటే వజ్రం దక్కింది:48 ఏళ్ల డైమండ్ దక్కించుకొన్న బ్యాంకు మేనేజర్

పొలం పనులు చేస్తున్న ఓ మహిళలకు వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని ఆమె గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారికి విక్రయించింది. రూ. 11 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారాన్ని వ్యాపారి ఆమెకు ఇచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

also read:కర్నూల్ మహిళకు దక్కిన అదృష్టం: పొలం పనులు చేస్తుండగా దొరికిన వజ్రం

భారీ వర్షాలతో తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వేరుశనగను తీస్తుండగా ఏడు క్యారెట్ల వజ్రం మహిళకు దొరికింది.ఇదే మండలంలో గతంలో ఓ మహిళా రైతుకు వజ్రం దొరికింది.ఈ వజ్రాన్ని ఆమె వ్యాపారికి విక్రయించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios