Asianet News TeluguAsianet News Telugu

రాయి అనుకొంటే వజ్రం దక్కింది:48 ఏళ్ల డైమండ్ దక్కించుకొన్న బ్యాంకు మేనేజర్

బ్యాంకు మేనేజర్ కు  అరుదైన వజ్రం దొరికింది. తొలుత దీన్ని ఆయన వజ్రంగా భావించలేదు. 
 

Man picks up shiny object thinking it is glass, turns out to be a diamond lns
Author
Southwest Arkansas Electric, First Published Sep 25, 2020, 4:49 PM IST

అర్కాన్సాస్:  బ్యాంకు మేనేజర్ కు  అరుదైన వజ్రం దొరికింది. తొలుత దీన్ని ఆయన వజ్రంగా భావించలేదు. 

సౌత్ వెస్ట్ అర్కాన్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. మౌమల్లెకు చెందిన కేవిన్ కినార్డ్ 48 ఏళ్ల క్రితం చరిత్రలో క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్  రెండో అతి పెద్ద వజ్రాన్ని కనుగొన్నారు.

చిన్నప్పటి నుండి స్టేట్ పార్కుకు ఆయనకు వెళ్లడం అలవాటు. ఈ పార్క్ లో సిఫ్టింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు ఓ రాయి కన్పించింది. చూడడానికి క్రిస్టల్ లా మెరుస్తుండడంతో ఆయన తన సంచిలో వేసుకొన్నాడు. 

also read:కర్నూల్ మహిళకు దక్కిన అదృష్టం: పొలం పనులు చేస్తుండగా దొరికిన వజ్రం

ఈ రాయిని పరీక్షించి చూస్తే  అసలు విషయం తెలిసింది.  ఈ రాయిని పరీక్షించి చూస్తే అరుదైన వజ్రంగా గుర్తించారు.9.07 కారెట్ల వజ్రంగా నిపుణులు చెప్పారు. 

క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వద్ద 246 వజ్రాలు నమోదు చేయబడ్డాయి. మొత్తం 59.25 క్యారెట్ల బరువు ఉంటుందని అంచనా. ప్రతి రోజూ ఈ ప్రాంతంలో  ఒకటి లేదా రెండు వజ్రాలను కనుగొంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios