మద్యం మత్తులో ఓ మహిళపై పొరుగింటి వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి... ఆమె వద్ద ఉన్న రూ.80వేలు చోరీ చేశాడు. ఈ దారుణ సంఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తూర్పుగోదావరి జిల్లా జి.వీమవరం గ్రామానికి చెందిన కీసనకుర్తి నాగమణి(55) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త 15 సంవత్సరాల క్రితం, కొడుకు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయారు. కాగా... ఆమె కుమార్తెకు వివాహం కాగా... హైదరాబాద్ లో ఉంటోంది.

కాగా... సోమవారం గ్రామంలో అందరూ సుబ్రహ్మణ్య షష్టి జరుపుకుంటున్నారు. కాగా... అదే గ్రామానికి చెందిన కీసనకుర్తి నాగబాబు విపరీతంగా మద్యం సేవించి నాగమణి ఇంట్లోకి ప్రవేశించాడు. కాగా... ఆ సమయంలో నాగమణి ఇంట్లో నిద్రపోతూ ఉంది. అదే అదనుగాచేసుకున్న నాగబాబు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం కిరాతకంగా హత్య  చేసి... ఆమె దాచుకున్న రూ.80వేల నగదు, ఆమె ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే... పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కారం పొడి చల్లడం గమనార్హం.

కాగా... మంగళవారం ఉదయం నాగమణి  చనిపోయన విషయాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే నాగబాబుపై అనుమానం కలగడంతో... అతనిని అదుపులోకి తీసుకొని విపరీతంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  బాధితురాలి వయసు 55 కాగా... నిందితుడి వయసు 35 అని పోలీసులు చెబుతున్నారు. అతనికి పెళ్లై భార్య కూడా ఉందని చెబుతున్నారు.