ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. దీని ప్రత్యేకతలేంటంటే..

ఆంధ్రప్రదేశ్ లో నేడు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బుధవారం నాడు 11 గంటల మూడు నిమిషాలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టనున్నారు.

Andhra Pradesh vote on Account Budget specialities are - bsb

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఈరోజు ప్రవేశపెట్టనున్నారు.  ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చివరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హాట్ హాట్ గా సాగుతున్నాయి. మంగళవారం నాడు శాసనసభలో చర్చ రచ్చ రచ్చగా సాగడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం కొలువుతీరే వరకు అంటే జూన్ వరకు ప్రభుత్వం చేయబోయే ఖర్చులకు ఈ బడ్జెట్ ద్వారా ఆమోదం పొందనున్నారు.

 ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ బుధవారం నాడు 11 గంటల మూడు నిమిషాలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ బడ్జెట్లో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి?  బడ్జెట్ ఎలా ఉండబోతుందనే దానిమీద రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మద్యంతర బడ్జెట్ కావడంతో కొత్త పథకాలు ఏవి ఉండబోవని తెలుస్తోంది. రూ. 95 వేల కోట్లనుంచి రూ. 96 వేల కోట్ల వరకు బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. ఇక రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ. 2.86 లక్షల కోట్ల బడ్జెట్ ని అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన: తొమ్మిది మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ ను బుధవారం నాడు అసెంబ్లీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి బడ్జెట్ అంచనాల కంటే తక్కువగానే ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019-2020లో 76% ఖర్చు చేసింది. అదే 2020- 2021కి వచ్చేసరికి 83%, 2022 -2023లో 83శాతం, 2023-2024లో శాతం ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఇక ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించే సమయంలో సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో ఒకటి ఏపీ అసైన్డ్ ల్యాండ్ బిల్లు 2024, ఆర్జేయూకేటి విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ,  రేషనలైజేషన్ సంబంధిత సవరణ బిల్లు 2024లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios