స్టేట్ బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభించింది. తెలంగాణ మూడవ స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. అంతకుముందు 2018 సంవత్సరంలో ఇటువంటి ర్యాంకింగ్ విడుదలైంది.

దేశీయ మరియు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రాల మధ్య పోటీని సృష్టించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్  బిజినెస్ పేరుతో రాష్ట్రాల ర్యాంకింగ్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది