చిత్తూరులో అత్యధికం, విశాఖలో అత్యల్పం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 20,82,843కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 984 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 2082843కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో ఎవరూ కూడా మరణించలేదు.
అమరావతి:Andhra pradesh రాష్ట్రంలో గత 24 గంటల్లో 984 కరోనా కేసులు నమోదయ్యాయి..గత 24 గంటల్లో24,380 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 984 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,82,843కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో ఎవరూ కూడా మరణించలేదు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,505 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 152 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 62వేల 732 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 5606 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అనంతపురంలో065,చిత్తూరులో 244, తూర్పుగోదావరిలో117,గుంటూరులో073,కడపలో 026, కృష్ణాలో055, కర్నూల్ లో015, నెల్లూరులో081, ప్రకాశంలో 033,విశాఖపట్టణంలో 151,శ్రీకాకుళంలో047, విజయనగరంలో 075,పశ్చిమగోదావరిలో 002కేసులు నమోదయ్యాయి.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,58,663, మరణాలు 1093
చిత్తూరు-2,49,906, మరణాలు1959
తూర్పుగోదావరి-2,95,602, మరణాలు 1290
గుంటూరు -1,79,821,మరణాలు 1260
కడప -1,16,138, మరణాలు 644
కృష్ణా -1,21,318,మరణాలు 1481
కర్నూల్ - 1,24,352,మరణాలు 854
నెల్లూరు -1,47,549,మరణాలు 1060
ప్రకాశం -1,38,953, మరణాలు 1130
శ్రీకాకుళం-1,23,943, మరణాలు 793
విశాఖపట్టణం -1,59,969, మరణాలు 1143
విజయనగరం -83,441, మరణాలు 673
పశ్చిమగోదావరి-1,80,298, మరణాలు 1125
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది. ఇవాళ్టి నుండి రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ సహా ఇతర ప్రాంతాల నుండి ఏపీలో తమ స్వంత ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ తరుణంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను నైట్ కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలని సీఎం ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలని సీఎం కోరారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని.. ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలని థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు.
కోవిడ్ హోం కిట్లలో మార్పులు చేయాలని సీఎం సూచించారు. చికిత్సకు ఉపయోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాని ఆయన కోరారు. 104 కాల్ సెంటర్లను పటిష్టపరచాలని అధికారులకు సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లను సిద్దం చేయాలని అన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఉండాలని చెప్పారు. కోవిడ్ నియంత్రణ చర్యలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక, కోవిడ్ ఆంక్షలకు సంబంధించి త్వరలోనే వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది