అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,855 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 54 వేల 385కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో కరోనాతో 52 మంది మరణించారు. కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో చిత్తూరులో ఎనిమిది, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఆరుగురి చొప్పున మరణించారు. కృష్ణా, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఐదుగురి చొప్పున మరణించారు. తూర్పుగోదావరి, కడప, కర్నూల్ లలో ముగ్గురి చొప్పున చనిపోయారు. విజయనగరంలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు.
 రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,558 మంది మరణించారు.

రాష్ట్రంలో  ఇంకా 69,353 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి కోలుకొన్నవారి సంఖ్య 5 లక్షల 79 వేల 447 గా ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 8,807మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత 24 గంటల్లో 76 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తే 7,855 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో ఇప్పటివరకు 53లక్షల 78 వేల 367 శాంపిల్స్ ను పరీక్షించారు. 


గత 24 గంటల్లో అనంతపురంలో 497 చిత్తూరులో 902, తూర్పుగోదావరిలో 1095, గుంటూరులో 551, కడపలో 545, కృష్ణాలో 346, కర్నూల్ లో 325, నెల్లూరులో 405,ప్రకాశంలో 927, శ్రీకాకుళంలో 461, విశాఖపట్టణంలో 425, విజయనగరంలో 384,పశ్చిమగోదావరిలో 992 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -54,760, మరణాలు 466
చిత్తూరు  -57,555 మరణాలు 617
తూర్పుగోదావరి -91,147మరణాలు 501
గుంటూరు  -51,783 మరణాలు 509
కడప  -41,484 మరణాలు 354
కృష్ణా  -25,281 మరణాలు 413
కర్నూల్  -55,045 మరణాలు 456
నెల్లూరు -49,568 మరణాలు 433
ప్రకాశం -44,637  మరణాలు 437
శ్రీకాకుళం -37,154 మరణాలు 315
విశాఖపట్టణం  -48,249 మరణాలు 411
విజయనగరం  -32,981 మరణాలు 215
పశ్చిమగోదావరి -61,651మరణాలు 431