అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 7738 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షల 25 వేల 514కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో కరోనాతో 57 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,359 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనాతో 57 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,359 మంది చనిపోయారు

గత 24 గంటల్లో కరోనా నుండి 10,608 మంది కోలుకొన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుండి  కోలుకొన్న వారు 5 లక్షల 41 వేల 319 అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇంకా యాక్టివ్ కేసులు 78,836 ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 539, చిత్తూరులో 794, తూర్పుగోదావరిలో 1260, గుంటూరులో 582, కడపలో 267, కృష్ణాలో 439, కర్నూల్ లో 275, నెల్లూరులో 444,ప్రకాశంలో  869, శ్రీకాకుళంలో 476, విశాఖపట్టణంలో 342, విజయనగరంలో 446 పశ్చిమగోదావరిలో 1005 కేసులు నమోదయ్యాయి. 


రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -52,837, మరణాలు 446
చిత్తూరు  -54,853 మరణాలు 587
తూర్పుగోదావరి -86,507మరణాలు 485
గుంటూరు  -49,446 మరణాలు 494
కడప  -39,531 మరణాలు 343
కృష్ణా  -24,030, మరణాలు 389
కర్నూల్  -54029, మరణాలు 444
నెల్లూరు -47,727 మరణాలు 422
ప్రకాశం -41,695 మరణాలు 418
శ్రీకాకుళం -35,944మరణాలు 311
విశాఖపట్టణం  -46,850 మరణాలు 390
విజయనగరం  -31424, మరణాలు 213
పశ్చిమగోదావరి -57,746 మరణాలు 417