ఏపీలో కరోనాతో ఐదున్నర వేల మంది మృతి: ఆరున్నర లక్షలకు చేరువలో కేసులు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 46 వేల 530కి చేరుకొన్నాయి. 

Andhra pradesh reports 7,228 new corona casest, total rises to 6,46,530 lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 46 వేల 530కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో కరోనాతో 45 మంది మరణించారు. కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురి చొప్పున మరణించారు. కృష్ణా, తూర్పు గోదావరి , విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురి చొప్పున చనిపోయారు. అనంతపురం, కడప, నెల్లూరులలో ముగ్గురి చొప్పున మరణించారు. గుంటూరు, కర్నూల్ , శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,506 మంది మరణించారు.

రాష్ట్రంలో  ఇంకా 70,357 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి కోలుకొన్నవారి సంఖ్య 5 లక్షల 70 వేల 667 గా ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

. గత 24 గంటల్లో 8,291 మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత 24 గంటల్లో 72, 838 మందికి పరీక్షలు నిర్వహిస్తే 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో ఇప్పటివరకు 53లక్షల 02 వేల 367 శాంపిల్స్ ను పరీక్షించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో 612 చిత్తూరులో 536, తూర్పుగోదావరిలో 1112, గుంటూరులో 648, కడపలో 600, కృష్ణాలో 428, కర్నూల్ లో 229, నెల్లూరులో 479,ప్రకాశంలో 502, శ్రీకాకుళంలో 319, విశాఖపట్టణంలో 414, విజయనగరంలో 387,పశ్చిమగోదావరిలో 962 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -54,263, మరణాలు 460
చిత్తూరు  -56,653 మరణాలు 609
తూర్పుగోదావరి -90,047మరణాలు 497
గుంటూరు  -51,232 మరణాలు 503
కడప  -40.939 మరణాలు 351
కృష్ణా  -24,1935 మరణాలు 408
కర్నూల్  -54,720 మరణాలు 453
నెల్లూరు -49,163 మరణాలు 426
ప్రకాశం -42,536  మరణాలు 432
శ్రీకాకుళం -36,893 మరణాలు 314
విశాఖపట్టణం  -47,824 మరణాలు 406
విజయనగరం  -32,597 మరణాలు 213
పశ్చిమగోదావరి -60,659మరణాలు 428


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios