అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,242 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య   7 లక్షల 19 వేల 256కి చేరుకొంది.

గత 24 గంటల్లో కరోనాతో 40 మంది మరణించారు. కృష్ణాలో ఆరుగురు, అనంతపురం, చిత్తూరులలో ఐదుగురి చొప్పున మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరులలో నలుగురి చొప్పున కరోనాతో చనిపోయారు. ప్రకాశం, విశాఖపట్టణంలలో ముగ్గురి చొప్పున, పశ్చిమ గోదావరి, కర్నూల్ లలో ఇద్దరి చొప్పున చనిపోయారు. విజయనగరంలో ఒక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,981కి చేరుకొంది. 

ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 72 వేల 237 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 6242 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు 6 లక్షల 55 వేల 980 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 54,400 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 411,చిత్తూరులో 863, తూర్పుగోదావరిలో 826, గుంటూరులో 562, కడపలో 408, కృష్ణాలో 469, కర్నూల్ లో 220, నెల్లూరులో 418,ప్రకాశంలో 582, శ్రీకాకుళంలో 192 విశాఖపట్టణంలో 222, విజయనగరంలో 221,పశ్చిమగోదావరిలో 853కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -5,87,734 మరణాలు 502
చిత్తూరు  -65,361 మరణాలు 675
తూర్పుగోదావరి -1,00,785 మరణాలు 541
గుంటూరు  -56,788 మరణాలు 544
కడప  -45,456మరణాలు 380
కృష్ణా  -29,186 మరణాలు 464
కర్నూల్  -57,072మరణాలు 470
నెల్లూరు -54,264 మరణాలు 454
ప్రకాశం -50,901 మరణాలు 498
శ్రీకాకుళం -40,509 మరణాలు 326
విశాఖపట్టణం  -51,049 మరణాలు 447
విజయనగరం  -36,123 మరణాలు 220
పశ్చిమగోదావరి -70,133 మరణాలు 460