అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అయితే రోజువారీ కేసుల సంఖ్య రెండు మూడు రోజులుగా గతంతో పోలిస్తే కొంత తక్కువగా నమోదౌతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 31 వేల 749కి చేరుకొన్నాయి.

 గత 24 గంటల్లో రాష్ట్రంలో 6235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షల 31 వేల 749కి చేరుకొన్నాయి.గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 9 మంది,  చిత్తూరులో ఏడుగురు,  విశాఖపట్టణంలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురి చొప్పున కరోనాతో మరణించారు. కర్నూల్ లో ముగ్గురు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. శ్రీకాకుళంలో ఒక్కరు మృతి చెందారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో 505 చిత్తూరులో 362, తూర్పుగోదావరిలో 1262, గుంటూరులో 532, కడపలో 219, కృష్ణాలో 133, కర్నూల్ లో 190, నెల్లూరులో 401,ప్రకాశంలో  841, శ్రీకాకుళంలో 283, విశాఖపట్టణంలో 150, విజయనగరంలో 395, పశ్చిమగోదావరిలో 962 కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో 51 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 5410 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10,502 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,821 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 51 లక్షల60వేల 700మందికి కరోనా పరిక్షలు నిర్వహించారు. 


రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -53,342, మరణాలు 451
చిత్తూరు  -55,215 మరణాలు 594
తూర్పుగోదావరి -87,769 మరణాలు 489
గుంటూరు  -49,978 మరణాలు 498
కడప  -39,750 మరణాలు 345
కృష్ణా  -24,123 మరణాలు 398
కర్నూల్  -54,219, మరణాలు 447
నెల్లూరు -48,128 మరణాలు 426
ప్రకాశం -42,536 మరణాలు 420
శ్రీకాకుళం -36,227మరణాలు 312
విశాఖపట్టణం  -47,000 మరణాలు 396
విజయనగరం  -31,819, మరణాలు 213
పశ్చిమగోదావరి -58,708 మరణాలు 421