అమరావతి: ఏపీ రాష్ట్రంలో  గత 24 గంటల్లో 5,795 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 7లక్షల 29 వేల 307కి చేరుకొన్నాయి.

గత 24 గంంటల్లో కరోనాతో 33 మంది మరణించారు. కృష్ణాలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్టణంలలో నలుగురి చొప్పున కరోనాతో మరణించారు. అనంతపురం, చిత్తూరులలో ముగ్గురి చొప్పున చనిపోయారు. గుంటూరు, పశ్చిమ గోదావరి,నెల్లూరులలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, విజయనగరంలలో ఒక్కరు చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6052 మంది చనిపోయారు.

ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 65 వేల 889 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 5795 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 62 లక్షల 16 వేల 240 మందికి పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో ఇప్పటివరకు 6 లక్షల 72వేల 479 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 50,776 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 209,చిత్తూరులో970, తూర్పుగోదావరిలో 801, గుంటూరులో 441, కడపలో 434, కృష్ణాలో 482, కర్నూల్ లో 123, నెల్లూరులో 451,ప్రకాశంలో 580, శ్రీకాకుళంలో 142, విశాఖపట్టణంలో 303 విజయనగరంలో 163,పశ్చిమగోదావరిలో 696కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -59,214, మరణాలు 509
చిత్తూరు  -66,555 మరణాలు 683
తూర్పుగోదావరి -1,02,439 మరణాలు 548
గుంటూరు  -57,673 మరణాలు 548
కడప  -46,181 మరణాలు 386
కృష్ణా  -29,847 మరణాలు 477
కర్నూల్  -57,281 మరణాలు 470
నెల్లూరు -55,080 మరణాలు 458
ప్రకాశం -52,147 మరణాలు 505
శ్రీకాకుళం -40,808 మరణాలు 327
విశాఖపట్టణం  -51,490 మరణాలు 455
విజయనగరం  -36,415 మరణాలు 222
పశ్చిమగోదావరి -71,342 మరణాలు 464