ఏపీలో ఆరు వేలు దాటిన కరోనా మరణాలు: మొత్తం 7,23,512కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 4256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 7,23,512కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 4256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 7,23,512కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 38 మంది కరోనాతో మరణించారు.కరోనాతో గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఏడుగురు, చిత్తూరు, కడపలలో ఐదుగురి చొప్పున, అనంతపురం, విశాఖపట్టణంలలో నలుగురి చొప్పున మరణించారు. తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరు,నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరి చొప్పున చనిపోయారు. శ్రీకాకుళం, విజయనగరంలలో ఒక్కరి చొప్పున మృతి చెందారు. దీంతో ఏపీ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,019 మంది మరణించారు.
ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 56 వేల 145మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 4256 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు 6 లక్షల 66 వేల 433 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 51,060 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 271,చిత్తూరులో224, తూర్పుగోదావరిలో 853, గుంటూరులో 444, కడపలో 231, కృష్ణాలో 179, కర్నూల్ లో 086, నెల్లూరులో 365,ప్రకాశంలో 666, శ్రీకాకుళంలో 157, విశాఖపట్టణంలో 138 విజయనగరంలో 129,పశ్చిమగోదావరిలో 513కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -59,005, మరణాలు 506
చిత్తూరు -65,585 మరణాలు 680
తూర్పుగోదావరి -1,01,638 మరణాలు 544
గుంటూరు -57,232 మరణాలు 546
కడప -45,687 మరణాలు 385
కృష్ణా -29,365 మరణాలు 471
కర్నూల్ -57,158 మరణాలు 470
నెల్లూరు -54,629 మరణాలు 456
ప్రకాశం -51,567 మరణాలు 500
శ్రీకాకుళం -40,666 మరణాలు 327
విశాఖపట్టణం -51,187 మరణాలు 451
విజయనగరం -36,252 మరణాలు 221
పశ్చిమగోదావరి -70,646 మరణాలు 462