అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 83 వేల 132కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 23 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురి చొప్పున మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరిలలో ఇద్దరి చొప్పున, కడపల, ప్రకాశం, విశాఖపట్టణంలలో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,429కి చేరుకొన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 70 లక్షల 66 వేల 203మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 74,945 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,986మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల40 వేల 229 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 36,474యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 201,చిత్తూరులో 458, తూర్పుగోదావరిలో 481, గుంటూరులో 496, కడపలో 266, కృష్ణాలో 503, కర్నూల్ లో 55, నెల్లూరులో 196,ప్రకాశంలో 334, శ్రీకాకుళంలో 168, విశాఖపట్టణంలో 218 విజయనగరంలో 82,పశ్చిమగోదావరిలో 528కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -62,469, మరణాలు 537
చిత్తూరు  -73,655 మరణాలు 741
తూర్పుగోదావరి -1,10,092 మరణాలు 586
గుంటూరు  -62,348 మరణాలు 584
కడప  -49,863 మరణాలు 396
కృష్ణా  -31,950 మరణాలు 412
కర్నూల్  -58,782 మరణాలు 480
నెల్లూరు -58,125 మరణాలు 478
ప్రకాశం -56,582 మరణాలు 555
శ్రీకాకుళం -42,606 మరణాలు 336
విశాఖపట్టణం  -53,806 మరణాలు 489
విజయనగరం  -38,180 మరణాలు 226
పశ్చిమగోదావరి -79,131 మరణాలు 4781