అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 58 వేల 951కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 32 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురి చొప్పున చనిపోయారు. గుంంటూరు, కడప జిల్లాల్లో నలుగురి చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరిలలో ముగ్గురి చొప్పున చనిపోయారు. చిత్తూరు, పశ్చిమగోదావరిలలో ఇద్దరు చొప్పున చనిపోయారు. కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణంలలో ఒక్కరి చొప్పున మృతి చెందారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 66 లక్షల 30 వేల 728మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 61,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,224 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

 ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 08 వేల 712 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 43,983 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 209,చిత్తూరులో293, తూర్పుగోదావరిలో 547, గుంటూరులో 379, కడపలో 190 కృష్ణాలో 086, కర్నూల్ లో 136, నెల్లూరులో 166,ప్రకాశంలో 270, శ్రీకాకుళంలో 133, విశాఖపట్టణంలో 135 విజయనగరంలో 191,పశ్చిమగోదావరిలో 489 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -61,156, మరణాలు 527
చిత్తూరు  -70,615 మరణాలు 707
తూర్పుగోదావరి -1,06,590 మరణాలు 571
గుంటూరు  -60,221 మరణాలు 564
కడప  -48,209 మరణాలు 400
కృష్ణా  -32,036 మరణాలు 498
కర్నూల్  -58,241 మరణాలు 478
నెల్లూరు -56,844 మరణాలు 472
ప్రకాశం -54,658 మరణాలు 536
శ్రీకాకుళం -41,831 మరణాలు 331
విశాఖపట్టణం  -52,651 మరణాలు 474
విజయనగరం  -37,515 మరణాలు 224
పశ్చిమగోదావరి -75,489 మరణాలు 474