Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 7, 86,050కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,918కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 86 వేల 050కి చేరుకొన్నాయి. 

andhra pradesh reports 2918 new corona cases, total rises to 7,86,050
Author
Amaravathi, First Published Oct 19, 2020, 6:38 PM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,918కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 86 వేల 050కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 24 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో నలుగురి చొప్పున మరణించారు. కడపలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.
దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,453కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 71 లక్షల 27 వేల 533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 61,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,918మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల44 వేల 532 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 35,065 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 218,చిత్తూరులో 380, తూర్పుగోదావరిలో 468, గుంటూరులో 333, కడపలో 155, కృష్ణాలో 117, కర్నూల్ లో 66, నెల్లూరులో 119,ప్రకాశంలో 308, శ్రీకాకుళంలో 143, విశాఖపట్టణంలో 120, విజయనగరంలో 44,పశ్చిమగోదావరిలో 487కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -62,687, మరణాలు 537
చిత్తూరు  -74,035 మరణాలు 745
తూర్పుగోదావరి -1,10,560 మరణాలు 588
గుంటూరు  -62,681 మరణాలు 588
కడప  -50,018 మరణాలు 415
కృష్ణా  -34,715 మరణాలు 528
కర్నూల్  -58,848 మరణాలు 480
నెల్లూరు -58,244 మరణాలు 479
ప్రకాశం -56,890 మరణాలు 556
శ్రీకాకుళం -42,749 మరణాలు 336
విశాఖపట్టణం  -53,926 మరణాలు 493
విజయనగరం  -38,224 మరణాలు 226
పశ్చిమగోదావరి -79,578 మరణాలు 482

 

 

Follow Us:
Download App:
  • android
  • ios