అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనాతో మరణించే వారి సంఖ్య కూడ భారీగా నమోదౌతున్నాయి. గత 24 గంటల్లో 44 మంది మరణించారు.

గత 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో అనంతపురంలో 9మంది, పశ్చిమగోదావరిలో 9మంది, కర్నూల్ లో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్టణంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు. ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు ,విజయనగరంలో ఒక్కరు మరణించారు. తాజా మరణాలను కలుపుకొంటే రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 452కి చేరుకొంది.

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 2437 మందికి కరోనా సోకింది. రాష్ట్రానికి చెందిన 2412 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 20 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో విదేశాల నుండి వచ్చిన వారిలో ఒక్కరికి కూడ కరోనా సోకలేదు. అయితే ఇప్పటివరకు విదేశాల నుండి వచ్చిన వారిలో 432 మందికి కరోనా సోకింది.

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 468 కేసులు రికార్డయ్యాయి.కర్నూల్ లో 403, చిత్తూరులో 257, తూర్పుగోదావరిలో 247,పశ్చిమగోదావరిలో207 కేసులు  నమోదయ్యాయి.అనంతపురంలో 162, కడపలో112,కృష్ణాలో108,శ్రీకాకుళంలో178,విశాఖపట్టణంలో49 కేసులు రికార్డయ్యాయి. 

జిల్లాల వారీగా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 3813, మరణాలు 49
చిత్తూరు 3331, మరణాలు33
తూర్పుగోదావరి3362, మరణాలు21
గుంటూరు 3824, మరణాలు 32
కడప 2094, మరణాలు 14
కృష్ణా 2852, మరణాలు 85
కర్నూల్ 4226, మరణాలు 113
నెల్లూరు 1464, మరణాలు13
ప్రకాశం 1291, మరణాలు 13
శ్రీకాకుళం 1092, మరణాలు 15
విశాఖపట్టణం 1612, మరణాలు 22
విజయనగరం 881, మరణాలు 10
పశ్చిమగోదావరి 207,మరణాలు 32