Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 12,926 కేసులు.. ఆ జిల్లాలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూడా కేసులు భారీగా నమోదవుతున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 12,926 కరోనా కేసులు (covid cases) నమోదయ్యాయి. 

Andhra Pradesh reported 12926 New covid cases and six deaths
Author
Vijayawada, First Published Jan 22, 2022, 4:45 PM IST

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూడా కేసులు భారీగా నమోదవుతున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 12,926 కరోనా కేసులు (covid cases) నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే రోజువారి కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,63,299కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో ఆరుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 14,538కి చేరింది. కరోనా నుంచి 3,913 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,75,618కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

తాజా కేసులలో అత్యధికంగా విశాఖపట్నంలో దాదాపు 2 వేల కేసులు వచ్చాయి. అనంతపురంలో 1,379, చిత్తూరులో 1,566, తూర్పు గోదావరిలో 756, గుంటూరులో 1,212, వైఎస్సార్ కడపలో 734, కృష్ణా‌లో 354, కర్నూలులో 969, నెల్లూరులో 875, ప్రకాశంలో 1,001, శ్రీకాకుళంలో 868, విశాఖపట్నంలో 1,959, విజయనగరంలో 568, పశ్చిమ గోదావరిలో 691 కరోనా కేసులు నమోదయ్యాయి. 

 

మరోవైపు దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే వరుసగా మూడో రోజు కూడా దేశంలో 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల సంఖ్య పదివేలు దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 488తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,88,884కి చేరింది. గత 24 గంటల్లో 2,42,676 కరోనాను జయించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక, దేశంలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. రోజువారి పాజివిటీ రేటు 17.22 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 16.65 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 5.43 శాతం, మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios