అమరావతి:కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు 60 కేసులు నమోదు చేశారు.

కరోనా విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై పోలీసులపై కేసు నమోదు చేశారు.అసత్య ప్రచారాలతో భయాందోళనలు సృష్టించడంతో పాటు కావాలనే విషం చిమ్మేలా కలిలీ పోస్టులు సృష్టించి వైరల్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు పెట్టారు.

చిత్తూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాల పరిధిలో 10 రోజుల పాటు  ఎక్కువగా నమోదయ్యాయి.  కరోనా విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

also read:80 ఏళ్ల వ్యక్తిని ఎస్ఈసీగా ఎలా నియమిస్తారు: జగన్ కు సోమిరెడ్డి ప్రశ్న

కరోనా విషయంలో తమకు తోచిన విధంగా  సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయమై పోలీసులు గుర్తించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం భారత్ లో చట్టరీత్యా నేరమని పోలీసులు చెప్పారు.కరోనా విషయమై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

ఏపీ రాష్ట్రంలో ఆదివారం నాటికి 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. రెడ్ జోన్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకొంటుంది.