వాట్సాప్‌లో టెన్త్ విద్యార్థులకు పాఠాలు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పదవ తరగతి విద్యార్థులకు సోషల్ మీడియా ద్వారా సిలబస్ ను పంపాలని యోచిస్తోంది. ప్రతి పాఠశాలకు ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి టెన్త్ విద్యార్థులకు సిలబస్ ను షేర్ చేయాలని భావిస్తోంది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పదవ తరగతి విద్యార్థులకు సోషల్ మీడియా ద్వారా సిలబస్ ను పంపాలని యోచిస్తోంది. ప్రతి పాఠశాలకు ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి టెన్త్ విద్యార్థులకు సిలబస్ ను షేర్ చేయాలని భావిస్తోంది.
ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేయనున్నారు. ఈ గ్రూప్ లో విద్యార్థులు, టీచర్లను చేర్చనున్నారు. ఈ గ్రూపులో సిలబస్ తో పాటు ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులను అందించనున్నారు.
ఇప్పటికే రేడియో, దూరదర్శన్ తో పాటు, ఎఫ్ఎం రేడియోల ద్వారా పదో తరగతి విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ లో ముఖ్యమైన పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలను పంపితే వాటికి విద్యార్థులు జవాబులు పంపాల్సి ఉంటుంది.
ఈ జవాబులను టీచర్లు దిద్ది విద్యార్థులకు పంపుతారు. ఏ ప్రశ్నకు విద్యార్థులు ఏ రకగా జవాబులు రాశారనే విషయమై విద్యార్థులకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 400 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ
ప్రభుత్వం ఆన్ లైన్ లో విద్యార్థులకు క్లాసులను ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని 24 వేల మంది విద్యార్థులు, 933 మంది టీచర్లు ఈ ఆన్ లైన్ తరగతుల్లో చేరతారు. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రూపంలో కూడ విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఏపీ సర్కార్ ప్లాన్ చేసింది. విద్యార్థులకు ప్రతి పాఠ్యాంశాన్ని వీడియో రూపంలో రికార్డు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తారు.
ఈ యూట్యూబ్ లింక్ ను వాట్సాప్ గ్రూపు లేదా ఈ మెయిల్ లో విద్యార్థులకు పంపుతారు. ఆ లింకక్ ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకొనేందుకు వీలుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన అభ్యాస పోర్టల్ లోకి వెళ్లి ప్రశ్నపత్రాలను డౌన్ లోడ్ చేసుకొనె వెసులుబాటు కల్పించారు.