అమరావతి: కరోనా కారణంగా ఎంసెట్ పరీక్షలు రాయలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పరీక్షలు రాయలేని విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపుగా అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకోవాలని ఏపీ ఎంసెట్ ఛైర్మెన్ ప్రోఫెసర్ ఎం. రామలింగరాజు కోరారు.

ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను ఇటీవలను పూర్తి చేసింది ప్రభుత్వం. ఏపీలో ఎంసెట్ పరీక్షలను ఈ ఏడాది జేఎన్ టీయూ నిర్వహిస్తోంది.  కరోనా నేపథ్యంలో  క్వారంటైన్ లో ఉన్న విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

అయితే పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కోవిడ్ బాధిత విద్యార్థులు మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నట్టుగా జేఎన్ టీ యూ వీసీ రామలింగరాజు ప్రకటించారు.

helpdeskeamcet2020@gmail.comకు మెయిల్ చేయాలని ఆయన సూచించారు.  కోవిడ్ పాజిటివ్ రిపోర్టును, ఎంసెట్ హాల్ టిక్కెట్టును ఈ నెల 30వ తేదీలోపుగా తమకు పంపాలని ఆయన కోరారు.

ఇప్పటికే కరోనా కారణంగా సుమారు 20 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని ప్రభుత్వానికి సమాచారం పంపారు. తమకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 

ప్రభుత్వం మరో అవకాశం కల్పించడంతో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ధరఖాస్తు చేసుకోవాలని జేఎన్‌టీయూ కోరింది.ఈ నెల 30వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించనున్నారు.