తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ విషయమై విచారణకు ప్రభుత్వం ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
అంతర్వేది: తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ విషయమై విచారణకు ప్రభుత్వం ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారిగా నియమించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
also read:అంతర్వేది ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...కాలిబూడిదైన స్వామివారి రథం (వీడియో)
ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ కు, జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకొన్నారు.
అంతర్వేదిలో రథం దగ్ధం కావడంపై దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.ఆదివారం నాడు తెల్లవారుజామున రథం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి చెందారు.
