Asianet News TeluguAsianet News Telugu

ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు: స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

Andhra Pradesh High court Stays on B.Ed Candidates for SGT Posts lns
Author
First Published Feb 21, 2024, 11:42 AM IST | Last Updated Feb 21, 2024, 11:53 AM IST

అమరావతి: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ  బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై  ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను కోర్టు విన్నది.  బీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చెప్పారు.

బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుల భర్తీ విషయమై  మంగళవారం నాడు కూడ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ విషయమై  సుప్రీంకోర్టు తీర్పు కూడ భిన్నంగా ఉన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  అయితే ఈ విషయమై తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios