అమరావతి: పోలీస్ కస్టడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నాడు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 తమ కస్టడీలోకి తీసుకొన్న వారిని 24 గంటల్లోపుగా పోలీసులు జడ్జి ముంద హాజరుపర్చాలని ఏపీ హైకోర్టు సూచించింది. అయితే నిబంధనలకు విరుద్దంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పోలీసుల తరపు కౌన్సిల్ చేసిన వాదనలపై హైకోర్టు స్పందించింది.  ఇలా అయితే హెబియస్ కార్పస్ కేసు సీబీఐ తో విచారణ చేయించాల్సి వస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.

ఏపీలో సీబీఐ శాఖను తెరవాల్సిన అవసరం ఏర్పడుతోందని హైకోర్టు తెలిపింది. పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై  విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పలు ఘటనలను పిటిషనర్ తరపు న్యాయవాది ఈ సందర్భంగా ఉదహరించారు. నిబంధనల ప్రకారంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరాన్ని కోర్టు గుర్తు చేసింది. జడ్జి ముందు తమ అదుపులో ఉన్నవారిని ప్రవేశపెట్టాలని కోర్టు సూచించింది.