ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ఏపీ హైకోర్టు ఆదేశం..
ఆనందయ్య కంటి చుక్కల మందు (Anandaiah eye drops) పంపిణీపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఆనందయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
ఆనందయ్య కంటి చుక్కల మందు (Anandaiah eye drops) పంపిణీపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఆనందయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తాను తయారుచేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టుగా హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తును తిరస్కరించొద్దని స్పష్టం చేసింది.
అయితే Anandaiah అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆనందయ్య చేసిన దరఖాస్తు, ప్రభుత్వ సమాధానాన్ని ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఆ తర్వాత వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ‘కరోనా వలన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంత మంది మరణించారు.? ఆనందయ్య మందు వలన ఎంత మంది మరణించారు..?.. మరణాల లెక్కలు తీసుకుందామా’ అని ప్రశ్నించింది. ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ ముగించింది.
Also read: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు బ్రేక్.. కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు..
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన మందుతో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన చాలా మంది ఆయన ఇచ్చే మందు కోసం కృష్ణపట్నానికి క్యూ కట్టారు. ఆయన ఇచ్చే మందుపై చాలా మంది నమ్మకం పెంచుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొందరు ఆనందయ్య మందు తీసుకన్నవారు తాము కరోనా నుంచి కోలుకున్నామని చెప్పారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆనందయ్య మందుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆనందయ్య తయారుచేసిన మందును ఆయుర్వేద నిపుణుల బృందం పరిశీలించింది. అయితే ఆనందయ్య మందు తయారుచేసే మూలికల్లో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని చెప్పింది. ఈ క్రమంలోనే ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ లభించిది. కానీ కంటి చుక్కల మందుకు మాత్రం అనుమతి లభించలేదు.