చంద్రబాబు అరెస్ట్ కేసు సిబిఐకి... ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగిందిలా...
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ కు కారణమైన స్కిల్ డెెవలప్ మెంట్ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలన్న ఉండవల్లి అరుణ్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును సిఐడితో కాదు సిబిఐతో దర్యాప్తు చేయించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ అరుణ్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.
ఉండవల్లి తరపు న్యాయవాది స్కిల్ డెవలప్ మెంట్ కేసును సిబిఐకి అప్పగించాలంటూ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలతో పాటు సీబీఐ, ఈడి, టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు సహా మొత్తం 44మందిని ప్రతివాదులుగా చేర్చారు. అయితే వీరికి నోటీసులు అందించడంలో జాప్యం జరిగిందని కోర్టుకు తెలిపారు ఉండవల్లి లాయర్. దీంతో ఈ ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు విచారణను రెండు వారాలు అంటే నవంబర్ 29 కి వాయిదా వేసింది న్యాయస్థానం.
Read More ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అంతరాష్ట్ర సమస్యలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఇది తీవ్రమైన ఆర్ధిక నేరంగా పేర్కొంటూ సిబిఐ దర్యాప్తు కోరుతున్నానని తెలిపారు. సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ చేయించాలంటూ ఉండవల్లి అరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐతో విచారణ చేయించాలంటున్న ఉండవల్లి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.