Asianet News TeluguAsianet News Telugu

Chandrababu Bail : మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్... నేడు హైకోర్టు విచారణ

టిడిపి హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలుచేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. 

Andhra Pradesh High Court Inquiry on TDP Chief Chandrababu Naidu Antisipatory Bail Petition AKP
Author
First Published Nov 27, 2023, 10:48 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. టిడిపి అధికారంలో వుండగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడంటూ వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా చేసిన పనులపై సిఐడితో విచారణ చేయించి కేసులు పెట్టిస్తోంది. ఇలా పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును చంద్రబాబును అరెస్ట్ చేసి ఏకంగా 50 రోజులకు పైగా సెంట్రల్ జైల్లో పెట్టారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు మరిన్ని కేసులను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసుల్లో అరెస్ట్ చేయకుండా వుండేందుకు చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

మద్యం పాలసీ విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఓ కేసు నమోదయ్యింది. తనకు కావాల్సిన వారికోసం చంద్రబాబు నిబంధనలను అతిక్రమించిన ప్రభుత్వ ఖజానాకు నష్టం  చేకూర్చాడంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కొద్దిరోజులగా ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.  

ఇప్పటికే ఈ మద్యం కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. విచారణకు సహకరిస్తానని చంద్రబాబు సిద్దంగా వున్నారు... కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. మద్యం పాలసీలో ఎలాంటి అక్రమాలు జరగలేవని... రాజకీయ కక్షసాధింపు కోసమే ఈ కేసు పెట్టారని వాదించారు.  17A అమ్మైండ్మెంట్ యాక్ట్ ఈ కేస్ కు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 

Chandrababu Naidu ఐఆర్ఆర్, ఇసుక పాలసీ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు: చర్యలొద్దని హైకోర్టు ఆదేశం

చంద్రబాబు తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఇక సిఐడి వాదనలు విననుంది. సిఐడి తరపున ఏజి శ్రీరామ్  వాదించనున్నారు. దర్యాప్తు కీలకదశలో వున్నందున చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని గత విచారణలో ఏజీ వాదించారు. ఇదే వాదనను ఆయన ఇవాళ కూడా వినిపించనున్నారు. చంద్రబాబు ఈ కేసును ప్రభావితం చేసే అవకాశాలున్నందుకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సిఐడి  కోరుతోంది. 

ఇక ఇదే మద్యం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా కేసు నమోదయ్యింది.  ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా దీనిపైనా నేడు విచారణ జరగనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios