ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ గవర్నర్.. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ గవర్నర్.. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఇందుకు సంబంధించిన ఓ నివేదికను కూడా అందజేసినట్టుగా తెలుస్తోంది. ఇక, శనివారం సాయంత్రం గవర్నర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానున్నారు. ఇక, ఢిల్లీలో పలు కార్యాక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. సోమవారం వరకు అక్కడే ఉండనున్నారు.
ఇక, ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అయితే ఏపీ గవర్నర్ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నారు.
