అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. నెలవారీ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడ భారీగా పడిపోయింది. ఇది కూడ రాష్ట్రానికి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

ఈ ఏడాది 70 వేల కోట్లు రెవిన్యూ వస్తోందని ఏపీ ప్రభుత్వం ఆర్ధిక శాఖ అంచనా వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనాలు తలకిందులయ్యాయి. ప్రతి నెల రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ఏడాది మార్చి  నుండి ఇప్పటివరకు లాక్ డౌన్ నేపథ్యంలో రూ. 21 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం చేసింది. కేంద్రం నుండి నాన్ ట్యాక్స్ రెవిన్యూ గ్రాంట్స్ కింద రూ. 53 వేల కోట్లు అంచనా వేసింది ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్గాల ద్వారా రూ. 13 వేల కోట్లు  వస్తాయని అంచనా. అయితే ఈ మేరకు ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. కరోనా నేపథ్యంలో ఆదాయం రావడం లేదు.ఇప్పటివరకు రాష్ట్రంలో అప్పులు రూ. 3 లక్షల కోట్లకు చేరాయి. 

ఏప్రిల్, మే నెలల్లో పన్నులు 20 శాతం కూడ వసూలు కాలేదు. జూన్, జూలైలో మెరుగైనా ఆశించిన మేరకు రాష్ట్రానికి నిధులు రాలేదు. జూన్ నెలాఖరుకు వరకు సెక్యూరిటీ వేలంలో రూ. 15 వేల కోట్లు అప్పులు చేసింది ప్రభుత్వం.జూలై మాసంలో మరో రూ. 6 వేల కోట్లను అప్పులు తీసుకొంది. 

లాక్ డౌన్ కారణంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 21 వేల కోట్లను అప్పులు చేసింది.