AP Ward Secretariat Staff Uniform:గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డ్రెస్‌ కోడ్‌ అమలు చేయబోతుంది.  మొత్తం 19 కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా మిగిలిన వారికి యూనిఫామ్‌ అందిస్తోంది. 

AP Ward Secretariat Staff Uniform: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ అందుబాటులోకి వచ్చింది. మొత్తం 19 కేటగిరీల ఉద్యోగుల్లో పనిచేస్తుండగా.. అందులో మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా మిగిలిన వారికి యూనిఫామ్‌ అందిస్తోంది. పురుషులు లైట్‌ బ్లూ కలర్‌ చొక్కా, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించాలని, మ‌హిళ ఉద్యోగులు లైట్‌ బ్లూ కలర్‌ టాప్, క్రీమ్‌ కలర్‌ పైజామా, క్రీమ్‌ కలర్‌ చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌ను యూనిఫామ్‌గా ధ‌రించాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది.

రాష్ట్రవ్యాప్తంగా.. ప్ర‌తి పురుష‌ ఉద్యోగికి మూడు జతల కోసం 7.50 మీటర్ల చొక్కా క్లాత్, 4.05 మీటర్ల ప్యాంట్‌ క్లాత్‌ను.. మహిళ ఉద్యోగులకు టాప్‌ కోసం 7.50 మీటర్లు, పైజామాకు 7.25 మీటర్లు, చున్నీకి మరో 7.50 మీటర్ల క్లాత్‌ను ప్ర‌భుత్వం అందిస్తుంది. మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్‌లు మినహా 1,00,104 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 95 వేల మందికి ప్ర‌భుత్వం యూనిఫామ్స్ పంపిణీ చేసింది. ఈ నెల 25 వ తేదీ వ‌ర‌కు మిగిలిన వారికీ కూడా అందజేయాల‌ని ఆదేశించింది.

 సచివాలయాల్లో పనిచేసే వారు నిత్యం ప్రజలతో మ‌మేక‌మై ఉన్నారు. వారికి ప్ర‌జ‌ల‌తో సత్సంబంధాలు ఉంటాయి. వారికి డ్రెస్‌ కోడ్‌ అమలు చేయడం వ‌ల్ల విధుల పట్ల నిబద్ధతతను పెరుగుతోంద‌నీ, డ్రెస్‌ కోడ్ ను బ‌ట్టి ఏ క్యాడర్‌కు చెందిన సిబ్బందో సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

అలాగే.. ఉద్యోగులకు ట్యాగ్‌లు కూడా ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్ర‌భుత్వం. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్‌ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్ ల‌ను అందించాల‌ని, డిజిటల్‌ అసిస్టెంట్‌కు రెడ్‌ ట్యాగ్స్, హెల్త్‌ సెక్రటరీకి వైట్‌ ట్యాగ్, మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్, వీఆర్‌ఓకు బ్రౌన్‌ ట్యాగ్, వ్య‌వ‌సాయ కార్య‌ద‌ర్శికి గ్రీన్‌ ట్యాగ్, ఎడ్యుకేషన్‌ సెక్రటరీకి ఆరంజ్‌ ట్యాగ్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు గ్రే ట్యాగ్ ఇవ్వ‌ల‌ని భావిస్తున్నారు. అంతేకాక‌.. సచివాలయాల్లో పనిచేసే సంక్షేమ-విద్య అసిస్టెంట్లు, వార్డు సంక్షేమ అభివృద్ధి సెక్రటరీలకు అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లను బట్టి 4 జీ సిమ్‌ కార్డులు పంపిణీ చేయాలని సిద్ద‌మైంది ప్ర‌భుత్వం.