Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు కేసీఆర్ షాక్: పోతిరెడ్డిపాడుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

 రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహా సామర్ధ్యం పెంపు)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బుదవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరింది.

Telangana government files petition in supreme court against rayalaseema lift irrigation
Author
Hyderabad, First Published Aug 5, 2020, 10:38 AM IST

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహా సామర్ధ్యం పెంపు)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మంగళవారం నాడు రాత్రి పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరింది.

వాస్తవానికి ఇవాళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఇవాళ ముందుగానే నిర్ణయించుకొన్న షెడ్యూల్ కారణంగా ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని ఆగష్టు 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రికి లేఖ రాశారు.ఈ లేఖ ఆధారంగా ఈ సమావేశాన్ని వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నదుల నీటి వాటాలో తమ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని ఈ పిటిషన్ లో పేర్కొంది తెలంగాణ సర్కార్. బచావత్ ట్రిబ్యునల్ కూడ ఇదే విషయాన్ని చెప్పిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు, టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ  తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని ఆ పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం కోరింది. 

ఇటీవల జరిగిన నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4వ తేదీన కూడ కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాల్లో చుక్క నీటిని కూడ వదులుకోమని ఇటీవలనే కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లకు నోటిఫికేషన్ ను కూడ జారీ చేసింది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల్లో కనీసం మంచినీటి ప్రాజెక్టులకు కూడ నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మండిపడుతోంది.  

ఈ విషయమై ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరో వైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తనుంది. 

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:పోతిరెడ్డిపాడుకు కృష్ణా బోర్డు బ్రేక్: జగన్ సర్కార్ ఏం చేయనుంది?

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జూలై  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios