అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నవంబర్ రెండో తేదీ నుండి పాఠశాలలు  ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

కరోనా ప్రోటోకాల్‌కి అనుగుణంగా స్కూల్స్ ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  స్కూళ్లకు రాని విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒక రోజు, 2, 4,6,8 తరగతుల క్లాసులకు  మరో రోజు క్లాసులను నిర్వహించనున్నారు.

ఒక్క క్లాసులో విద్యార్ధుల సంఖ్య కంటే 750 కంటే  ఎక్కువ మంది విద్యార్ధులుంటే మూడు రోజులకు ఒకసారి తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

నవంబర్ మాసంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని  సీఎం జగన్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడ అమలు చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పాఠశాలల వేళలపై డిసెంబర్ మాసంలో నిర్ణయం తీసుకొంటామని సీఎం జగన్ చెప్పారు.

also read:ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ వాయిదా:నవంబర్ 2న పాఠశాలల ప్రారంభం

ఈ మాసంలోనే పాఠశాలలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని  నవంబర్ మాసంలో పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకొంది. అయితే జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన ప్రారంభించారు.