మానవతా థృక్పథంతో వ్యవహరించాలి: అంబులెన్స్ నిలిపివేతపై కేసీఆర్ సర్కార్‌కి సజ్జల వినతి
సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయకుండా రోగులకు వైద్యం అందించే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
అమరావతి: సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయకుండా రోగులకు వైద్యం అందించే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు, చెన్నై హైద్రాబాద్ లాంటి నగరాలతో పోలిస్తే ఏపీలో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్నాయన్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లు నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
also read:సరిహద్దుల్లో ఆంక్షలు: తెలంగాణపై కోర్టుకు వెళ్లే యోచనలో జగన్ సర్కార్
హైకోర్టు చెప్పినా కూడ తెలంగాణ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్ పెట్టిందన్నారు. తెలంగాణ పెట్టిన గైడ్‌లైన్స్ పాటించడం కష్టంగా ఉందని చెప్పారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లను దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మౌళిక వసతులను అభివృద్ది చేయలేదన్నారు. తమ రాష్ట్రంలోని ప్రజల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడం సహజమేనని ఆయన చెప్పారు.
మానవత్వంతో దీన్ని చూడాల్సిన అవసరం ఉందని ఆయన తెలంగాణ సర్కార్ ను కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తమకు ఇబ్బంది కల్గించడం లేదని సజ్జల గుర్తు చేశారు.సరిహద్దుల్లో అంబులెన్స్ లు నిలిపివేసాన సమస్యను ఆవేశంతో కాకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.