అమరావతి:  అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు, కేబినెట్ సబ్ కమిటీ దర్యాప్తును నిలిపివేయాలని  కోరుతూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ను సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది.

అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి  వచ్చిన తర్వాత జగన్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ  నివేదికను ఇచ్చింది.

also read:బాబుకి ఊరట: అమరావతి భూముల వ్యవహారంలో సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే

ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ సుమారు 4 వేల ఎకరాల్లో టీడీపీ నేతలు, కుటుంబసభ్యులు  భూములు కొనుగోలు చేశారని నివేదిక తెలిపింది.

ఈ భూముల కొనుగోలు వ్యవహరంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటి ,సిట్ దర్యాప్తు. వ్యవహరంపై స్టే ఇచ్చింది.

అమరావతిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుపై ఏసీబీ  కేసు నమోదు చేసింది. ఈ నెల 15వ తేదీన శ్రీనివాసరావు సహా 12 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.