Exit Polls: రికార్డు స్థాయిలో పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే?
Exit Polls: గతంలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఎవరి వైపు ఓటర్లు మొగ్గుచూపారనే అసక్తి నెలకొంది. అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాకపోవడంతో మరింత ఉత్కంఠను పేంచింది.
Andhra Pradesh Exit Polls: దేశంలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి మే 13న పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సీఈవో ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ వివరాలను పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతంగా ఉన్నాయని తెలిపారు.
ప్రస్తతుం పూర్తయిన నాలుగో దశ వరకు సాగిన పోలింగ్ వివరాలు గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో నమోదైన పోలింగ్ శాతం దేశంలోనే అత్యధికం కావడం విశేషం. దీంతో రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, పోలింగ్ పూర్తియిన వెంటనే వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఈ సారి రాలేదు. దీంతో ప్రజలతో పాటు ఆయా రాజకీయా పార్టీల్లోనూ ఉత్కంఠ పెరిగింది. ఎందుకు ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయి? ఎన్నికల సంఘం ఏం చెబుతోంది?
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే?
పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ దశల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటివరకు 4వ దశ ఎన్నికలు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఇంకా 3 దశల ఎన్నికల పూర్తికావాల్సి ఉంది. ఈ క్రమంలోనే దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి. అంటే జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ ముందుగా విడుదల చేస్తే మిగతా దశల ఎన్నికలు ప్రభావితం అవుతాయనే కారణంతో ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం 4వ దశ ఎన్నికలు పూర్తి కాగా జూన్ 1న చివరిదైన 7వ దశ పోలింగ్ జరగనుంది. అంటే జూన్ 1న సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి.
ఆంధ్రప్రదేశ్ లో 81.86 శాతం పోలింగ్.. దేశంలోనే ఇది అత్యధికం : సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
రసవత్తరంగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 5 జట్ల ఫైట్.. ఛాన్సులు ఇలా ఉన్నాయి..
- AP Assembly Elections 2024
- AP exit polls
- Andhra Pradesh Elections
- Assembly Elections 2024
- BJP
- Chandrababu Naidu
- Congress
- Election Commission
- Elections and Elections 2024
- Exit Polls
- Jana Sena
- Lok Sabha Elections 2024
- Pawan Kalyan
- Telangana Elections
- Telugu Desam Party
- YS Jagan Mohan Reddy
- YSRCP
- exit poll predictions
- restrictions on exit polls