Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుండదు.....కేఈ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అన్న కేఈ ఇతర పార్టీలతో పొత్తులు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. 

Andhra Pradesh deputy CM K.E.on TDP-Congress alliance
Author
Kurnool, First Published Aug 26, 2018, 3:36 PM IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అన్న కేఈ ఇతర పార్టీలతో పొత్తులు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. 

మరోవైపు కర్నూలు జిల్లాలో నిర్వహించిన ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆనందం వ్యక్తం చేశారు. దీక్షకు వచ్చిన స్పందన చూస్తుంటే జిల్లాలోని అన్ని నియెజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని కేఈ ధీమా వ్యక్తం చేశారు. 

ఇకపోతే పొత్తులపై ఎవరు ఎలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పొత్తులపై వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం కేఈ, మరోమంత్రి అయ్యన్నపాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తుల గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అప్పటి వరకు మాట్లొద్దని ఆదేశించారు. అయినా కేఈ పొత్తులపై వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ తో పొత్తు.. కళా వెంకట్రావు ఎమన్నారంటే..

కాంగ్రెస్‌తో పొత్తుపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

మంత్రులతో చంద్రబాబు పొత్తు చర్చలు: కాంగ్రెస్ వైపు మొగ్గు?

టీడీపితో పొత్తుపై రఘువీరా రెడ్డి స్పందన ఇదీ

 

Follow Us:
Download App:
  • android
  • ios