మదనపల్లి లో జరిగిన జంట హత్యల కేసులో  చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... పోలీసులు సత్వరమే వెళ్లడంతో మానసిక దుర్బలత్వంతో ఉన్న నిందితుల ప్రాణాలు మిగిలాయి.

విచారణ పూర్తి చేసి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశాం. నిందితులు ఒక రకమైన ట్రాన్స్ స్థితిలో ఉండిపోయారు. తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన, విచిత్రమైన మానసిక స్థితి లో ఉన్నారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టాం. 

విపరీతమైన మూఢనమ్మకాలు విచిత్రమైన ఆధ్యాత్మిక ప్రవర్తన తో హత్యలు జరిగినట్టు భావిస్తున్నాం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనిపించడంలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తాం అని అన్నారు. అయితే మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.