ఆ తప్పును సరిదిద్దుతాం: రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో రాజధాని విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏలూరులో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు: అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయం తీసుకొంటానని రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం నాడు ఏలూరులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకొన్నారని సీఎం వైఎస్ జగన్ చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొన్న నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు.
Also read:రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె
ఈ అన్యాయాన్ని సరిదిద్దుతానని జగన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసిందని జగన్ ఆరోపించారు. అన్నదమ్ముల్లా ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా నిర్ణయాలు ఉంటాయని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
Also read:అమరావతి రైతులకుషాకిచ్చిన పోలీసులు: హత్యాయత్నం కేసులు
అందరి అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అందరి అభివృద్ధి కోసం వినియోగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Also read:నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: ఆళ్ల సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలు ఇచ్చింది. అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతానికి చెందిన 29 గ్రామాల ప్రజలు శుక్రవారం నుండి సకల జనుల సమ్మె నిర్వహిస్తున్నారు.