రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

అమరావతిలోనే రాజదానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు సకల జనుల సమ్మెకు దిగారు. 

Three capitals:Amaravathi Farmers starts Sakalajanula Samme

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లోని 29 గ్రామాల ప్రజలు శుక్రవారం  నుంచి సకల జనుల సమ్మెకు దిగారు. ఈ సమ్మె నుండి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. 

Also read:బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సమ్మెకు సహకరించాలని రాజధాని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేయకుండా తమ సమ్మెకు సహకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.

Three capitals:Amaravathi Farmers starts Sakalajanula Samme

 జేఏసీ నిర్ణయం మేరకు 29 గ్రామాల ప్రజలు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం డబ్బులు లేకపోతే తామే నిధులను సేకరిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు అవసరమైతే తాము నిధులను సేకరిస్తామని వారు తేల్చి రాజధాని జేఎసీ ప్రకటించింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios