అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ వారంలో మరోసారి న్యూఢిల్లీకి వెళ్లనున్నారని ప్రచారం సాగుతోంది.  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్లను కోరినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. సుమారు అరగంటపాటు జగన్ సమావేశమయ్యారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశాడు. సుమారు ఎనిమిది పేజీల లేఖను ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు పంపిన విషయం తెలిసిందే.

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సీఎంఓ అధికారులు ఈ విషయమై ధృవీకరించాల్సి ఉంది. ఈ వారంలోపుగానే సీఎం ఢిల్లీ టూర్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. 

గత వారంలో ఢిల్లీ టూర్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర విషయాలపై సీఎం జగన్  ఢిల్లీ పెద్దలతో చర్చించారు.