Fire at Vizag fishing harbour: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. యూట్యూబర్ పై కేసు నమోదు ! (వీడియో)

నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన ఉన్న బోటులో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh CM YS Jagan inquiry on Visakha Fishing Harbour fire accident, case has been registered against YouTuber - bsb

విశాఖపట్నం : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 50 పడవల వరకు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. బోట్లలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో  ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజును వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించాలని తెలిపారు. 

విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన ఉన్న బోటులో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యూట్యూబ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్న గంగపుత్రులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారనుకున్నారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాద ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంతో జాలర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios