అమరావతి: కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది.  కొత్త ఇసుక పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది.

అన్నిఇసుక రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక రీచులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు ముందుకు రాకపోవడంతో  పేరొందిన సంస్థలకు ఇసుక రీచ్ లను అప్పగించాలని నిర్ణయించారు.

also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాశాంలపై చర్చ

ఓపెన్ టెండర్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇసుక తవ్వకాలు, సరఫరాను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. వరదలు, భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై రూపొందించిన అంచనాలను కెబినెట్‌ లో చర్చ జరగనుంది. సుమారు రూ. 10 వేల కోట్ల మేర నష్టం  వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. 

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు భూములను కేటాయించే విషయంలో కెబినెట్‌ చర్చించనుంది.  ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.ఈ విషయమై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.