Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలకాశాంలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశాలపై కూడ సమావేశంలో చర్చించనున్నారు.
 

Andhra pradesh cabinet starts today lns
Author
Amaravathi, First Published Nov 5, 2020, 11:21 AM IST


అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం గురువారం నాడు అమరావతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశాలపై కూడ సమావేశంలో చర్చించనున్నారు.

కొత్త ఇసుక పాలసీపై ఇప్పటికే ప్రజాభిప్రాయాలను స్వీకరించిన ప్రభుత్వం. ఈ పాలసీని కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులపై చర్చించనుంది.దిశా బిల్లు, అసైన్డ్‌ భూముల లీజుల బిల్లుపై చర్చించనున్నారు.

వరదలు, భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై రూపొందించిన అంచనాలను కెబినెట్‌ లో చర్చ జరగనుంది. సుమారు రూ. 10 వేల కోట్ల మేర నష్టం  వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. 

మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు భూములను కేటాయించే విషయంలో కెబినెట్‌ చర్చించనుంది.  ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.ఈ విషయమై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

బందరు పోర్టు పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై కెబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios