Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh Budget 2024 Updates, Highlights : ఏపీ ఓటాన్ బడ్జెట్ రూ.2,86,389 కోట్లు

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రూ.2,30,110 కోట్ల రెవెన్యూ  వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. 

Andhra Pradesh Budget 2024 Live Updates AKP
Author
First Published Feb 7, 2024, 9:41 AM IST

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,86,389 కోట్లు

ఆదాయ వ్యయం రూ.2.30,110 కోట్లు 

ముూలధన వ్యయం రూ.30,530
 

గత ఐదేళ్లలో ప్రభుత్వ విజయాలు : 

2018-19 లో రాష్ట్రం  11 శాతం స్థూల ఉత్పత్తి  రేటుతో దేశంలో 14వ స్థానంలో వుంటే 2023 లో ఇది 16.2 శాతానికి పెరిగి 4వ స్థానానికి పురోగమించింది. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార సంస్కరణల కారణంగా  సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో వుంది.

13 శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షి వృద్ది రెటుతో దేశంలోనే 6 స్థానం 

డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల భీమా రైతులకు అందిస్తున్న ఏకైన రాష్ట్ర మనదే.

చేపల  ఉత్పత్తిలో దేశంలోనే ముందజలో... ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా ఏపీ 

వ్యవసాయ మార్కెట్ కమిటీలో షెడ్యూల్ కులాలు, తెగల, వెనకబడిన తరగతుల మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.

2022 అత్యంత ప్రసిద్ద పర్యాటక ప్రదేశాల జాబితాలో ఏపీ 3వ స్థానం

విశాఖలోని రుషికొండ బీచ్ కు బ్లూ ప్లాగ్ 

2023 లో ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి 


వైసిపి హయాంలో ఇలా... టిడిపి హయాంలో అలా... ఉద్యోగ నియామకాలు సాగాయిలా

గత ఐదేళ్లలో 4 లక్షల 93 వేల ఉద్యోగాల భర్తీ చేసాం. వీటిలో 2 లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు... 2014-19 మధ్యకాలంలో టిడిపి  హయాంలో కేవలం34,108 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసారు. 

100 ఏళ్ళ తర్వాత భూ భద్ర ఆంధ్ర

100 ఏళ్ళ తర్వాత వైఎస్సార్ జగననన్న శాశ్వత భూ హక్కు  మరియు భూ రక్ష పథకాన్ని ప్రారంభించాం.  భూమి, సర్వే రికార్డులు, వివాదాలు,కేసులు పరిష్కారానికి మార్గదర్శకాలు, పరివర్తనాత్మక చర్యలు తీసుకున్నాం. ఆంధ్ర ప్రదేశ్ భూ హక్కుల చట్టం 2023 రూపొందించామని తెలిపారు. 

ఆడుదాం ఆంధ్రా

 ఆడుదాం ఆంధ్రా  కార్యక్రమానికి  12 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందించాం. వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకం ద్వారా  ప్రోత్సాహకాలు, క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుచేయడం జరిగింది. 
 

13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు

గత ఏడాది 2023 సంవత్సరం మార్చిలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 13 లక్షల 11 వేల కోట్ల రూపాయల విలువైన 386 ఒప్పందాలు జరిగాయి. దీంతో 6 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నారు. 

Andhra Pradesh Budget 2024 Live Updates AKP

రహదారుల అభివృద్ది 

 రాష్ట్ర రహదారుల అభివృద్ది కోసం రూ.2,626 కోట్లు, జిల్లాల రహదారుల అబివృద్దికి రూ.1955 కోట్లు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి రూ.272 కోట్లు ఖర్చు చేసామని అన్నారు. 

రహదారుల అభివృద్ది 

 రాష్ట్ర రహదారుల అభివృద్ది కోసం రూ.2,626 కోట్లు, జిల్లాల రహదారుల అబివృద్దికి రూ.1955 కోట్లు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి రూ.272 కోట్లు ఖర్చు చేసామని అన్నారు. 

పారిశ్రామిక, ఓడరేవుల అభివృద్ది 

ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-27 ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ ఓడరేవులను రూ.20 వేల కోట్లతో నిర్మించాం. 3,800 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. 127 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల ఏర్పాటు చేసాం. 
 

ఏయే పథకాలకు ఎంత ఖర్చు చేసారంటే...

వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాది తోఫాకు రూ.350 కోట్ల రూపాయలు పంపిణీ, వైఎస్సార్ ఇబిసి నేస్తం కింద మహిళలకు రూ.1,257 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న  తోడు కింద రూ.3,374 కోట్లు,  జగనన్న చేదోడు కింద రూ.1,268 కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర  కింద రూ.1,305 కోట్లు అందించాం. 
 

వైఎస్సార్ పెన్షన్ కానుక 

వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద రూ.84,731 కోట్ల రూపాయలను 66 లక్షల 35 వేల మందికి అందించామని అన్నారు. 
 

రాష్ట్ర తలసరి ఆదాయం 

2019 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 తొ  దేశంలో 18వ స్థానంలో వుంటే ప్రస్తుతం రూ.2,19,518 తో 9వ ర్యాంకులో వుంది. 
 

30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ

గత ప్రభుత్వం 4,63,697 ఇళ్ల పట్టాలు ఇస్తే వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 53 వేల కోట్ల రూపాయలతో 30,65,315 ఇళ్ల పట్టాల పంపిణీ. 

మేం పేదరికంపై... చంద్రబాబు దోమలపై దండయాత్ర

వైసిపి ప్రభుత్వం పేదరికంపై యుద్దం చేస్తే గతంలో టిడిపి హయాంలో దోమలపై దండయాత్ర చేసారంటూ ఆర్థిక మంత్రి ఎద్దేవా చేసారు. 
 

మత్స్య సంపద

అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు... 2 వేల ఫిష్ ఆంధ్రా రిటైల్ దుకాణాలు ఏర్పాటు... ఆంధ్ర ప్రదేశ్ మత్య సంపద అభివృద్ది సంస్థ, ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసాం. 

ఉచిత విద్యుత్ కోసం రూ. రూ.37,374 కోట్లు
 
2019 నుండి ఇప్పటివకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీని అందించింది. రూ.3 వేల కోట్లత ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసాం. 

వైఎస్సార్ రైతు భరోసా, రైతు భీమా

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా 53 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో 33,300 కోట్ల రూపాయలను జమ చేసామన్నారు.  వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద రూ.7,802 కోట్లు అందించింది. 
 

వైఎస్సార్ చేయూత, పాలవెల్లువ పథకాలు

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది  మహిళా మహారాణులకు రూ.14,129 కోట్లు చెల్లించామని తెలిపారు.  జగనన్న పాలవెల్లువ పథకానికి రూ.2,697 కోట్లు ఖర్చు చేసామన్నారు. 
 

జగనన్న అమ్మమ ఒడి పథకం 

జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 43, లక్షల 61 వేల మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందాయి.  దీని ఫలితంగా 2019 లో స్కూళ్లలో చేరేవారి సంఖ్య 87 శాతంగా ఉంటే 2023 కు 98 శాతానికి చేరింది.
 

53,126 మంది ఆరోగ్ సంరక్షణ సిబ్బంది నియామకం

53,126 మంది ఆరోగ్ సంరక్షణ సిబ్బందిని నియమించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ వైద్య పోస్టుల ఖాళీల సగటు 61 శాతం వుంటే రాష్ట్రంలో 4 శాతం తక్కువగా వుందన్నారు. 
 

53,126 మంది ఆరోగ్ సంరక్షణ సిబ్బందిని నియమించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ వైద్య పోస్టుల ఖాళీల సగటు 61 శాతం వుంటే రాష్ట్రంలో 4 శాతం తక్కువగా వుందన్నారు. 
 

కుప్పం అభివృద్దిపై ఆర్థికమంత్రి కామెంట్స్ 

కుప్పంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆర్థిక మంత్రి. ఎలాంటి వివక్ష లేకుండా  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమ్మిళితంగా అభివృద్ది చేస్తున్నామని బుగ్గన తెలిపారు. 

ఏపీ ఓటాన్ బడ్జెట్ రూ.2,86,389 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2014 ను రూ.2,86,389 కోట్లతో ప్రవేశపెట్టారు.  రూ. 24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్య లోటుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.  

అపర చాణక్యుడు మన సీఎం వైఎస్ జగన్

సివిల్ వార్ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితోనే సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని అన్నారు. 
సీఎం ఆలోచనలు,ఆశయాలు వారికి దగ్గరగా వున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించామని అన్నారు. అర్థశాస్త్రంలో చాణుక్యుడిలాంటి వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆర్దికమంత్రి అన్నారు. 
 

మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం..

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి ముందు మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఏపీ పబ్లిక్ సర్వీసెస్ సవరణ బిల్లు, ఆర్జీయూకేటీ సవరణ బిల్లు, అసైన్డ్ ల్యాండ్స్ బదిలీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 
 

స్పీకర్ చాంబర్ లోకి  చొచ్చుకెళ్లేందుకు టిడిపి ఎమ్మెల్యేల ప్రయత్నం...

వైసిపి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు టిడిపి సభ్యులు. నిర్ణీత సమయానికి సభ ప్రారంభంకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఛాంబర్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు  ఎమ్మెల్యేలు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. తోటి టిడిపి శాసన సభ్యులతో కలిసి నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి చేరుకున్నారు. 

అసెంబ్లీ లాబీలో సస్పెండయిన టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన వీడియోలు

 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష టిడిపి సభ్యుల ఆందోళన కొనసాగుతోంది.  గత రెండు రోజులుగా అసెంబ్లీని స్తంబింపజేస్తున్న  టిడిపి సభ్యులు ఇవాళ కూడా సభ ప్రారంభంకాగానే స్పీకర్ పోడియంవద్దకు చేరుకుని పెద్దపెట్టున నినాదాలు చేసారు. దీంతో టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ 2024-25 ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ప్రభుత్వ ఆదాయవ్యయాలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ 2024 కు కేబినెట్ ఆమోదం లభించింది. మరికొద్దిసేపట్లో అసెంబ్లీ కూడా ఈ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. 

సచివాలయంలో బడ్జెట్ ప్రతులకు వేదపండితులు ప్రత్యేక పూజలు చేసారు. ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ పూజల్లో మంత్రి బుగ్గనతో పాటు అధికారులు పాల్గోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతులను అందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios