నిడదవోలు అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేయనుంది. ఈ మేరకు ఇవాళ జనసేన అధికారికంగా ప్రకటించింది.

అమరావతి: నిడదవోలు అసెంబ్లీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ పోటీ చేయనున్నారు.ఈ మేరకు సోమవారం నాడు జనసేన అధికారికంగా ప్రకటించింది. రాజమండ్రి రూరల్ స్థానం నుండి కందుల దుర్గేష్ ను బరిలోకి దింపాలని జనసేన భావించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read:మమ్మల్ని రక్షించండి: ఇండియాను కోరిన రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న నేపాల్ వాసులు (వీడియో)

అయితే ఈ స్థానంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత మాసంలో టీడీపీ, జనసేన ప్రకటించిన తొలి విడత జాబితాలో రాజమండ్రి రూరల్ స్థానాన్ని ప్రకటించలేదు. ఈ ఇద్దరు అభ్యర్థులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్

రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కాదని జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేష్ ను బరిలోకి దింపడంపై రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ పోటీ చేస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత మాసంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు లింక్: రిపోర్ట్

రాజమండ్రి రూరల్ స్థానంలో సిట్టింగ్ సీటును వదులుకోవడానికి టీడీపీ సానుకూలంగా లేదు. ఈ విషయమై జనసేనతో చర్చించింది. నిడదవోలు అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు టీడీపీ కేటాయించింది. దరిమిలా కందుల దుర్గేష్ ను నిడదవోలు నుండి జనసేన బరిలోకి దింపింది.ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించారు.

తెలుగుదేశం-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది.జనసేన,బీజేపీకి 30 అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలను తెలుగుదేశం కేటాయించింది. ఇప్పటికే ఐదు స్థానాలను జనసేన ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన నిడదవోలు స్థానంతో జనసేన ఆరు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది.