ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే

AP Assembly Election Results 2024: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ ఘోర ఓట‌మిని చ‌విచూసింది. మొత్తం 175 స్థానాల్లో కేవ‌లం 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. 
 

Andhra Pradesh Assembly Election Results 2024 : These are the YSRCP candidates who won in Andhra Pradesh RMA

AP Assembly Election Results 2024: తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జెఎస్‌పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో కూడిన కూట‌మి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు 2024లో అఖండ విజయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. 135 స్థానాల్లో విజ‌యంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీడీపీ, రెండో స్థానంలో ఉన్న జ‌న‌సేన 21 స్థానాల్లో విజ‌యం సాధించింది. అధికార వైకాపా కేవ‌లం 11 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది. దీంతో రాష్ట్రంలో మూడవ అతిపెద్ద పార్టీగా దిగజారింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచింది వీరే

క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థి మొత్తం ఓట్లు మార్జిన్
1 అరకు రేగం మత్యలింగం 65658 31877
2 పాడేరు మత్స్యరాస విశ్వేశ్వర రాజు 68170 19338
3 యర్రగొండపాలెం (SC) చంద్ర శేఖర్ తాటిపర్తి 91741 5200
4 దర్శి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి 101889 2456
5 బద్వేల్ దాసరి సుధ 90410 18567
6 రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 92609 7016
7 పులివెందుల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 116315 61687
8 మంత్రాలయం వై. బాలనాగి రెడ్డి 87662 12805
9 ఆలూరు బి. విరూపాక్షి 100264 2831
10 తంబళ్లపల్లె పి. ద్వారకనాథ రెడ్డి 94136 10103
11 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100793 6095

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : టీడీపీ నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : జ‌న‌సేన నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios