అమరావతి: ఇళ్లస్థలాల కోసం కాకినాడలో మడ అడవులను నరికివేయడంపై దాఖలయిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్రం కౌంటర్ ధాఖలు చేసింది. దీంతో రిప్లయ్ కౌంటర్ ధాఖలు చేయడానికి పిటిషనర్ తరుపు న్యాయవాది విష్ణుతేజ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణనను రెండువారాలు వాయిదా వేసిన ధర్మాసనం. 

కాకినాడ పోర్టు సమీపంలోని మడ అడవులను నరికివేసి పేదలకు  ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ఇలా మడ అడవులను నరికివేసి ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని స్థానిక మత్స్యకారులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నేతలు కూడ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

READ MORE   మడ అడవుల నరికివేతపై టీడీపీ నిజ నిర్ధారణ: పొలిట్‌బ్యూరో తీర్మానాలివే..

మడ అడవుల నరికివేతను నిరసిస్తూ మత్స్యకారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గతంలోనే హైకోర్టు వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ జరిపి స్టేటస్ కో విధించింది. తాజాగా మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం మరో రెండు వారాలకు వాయిదా వేసింది. 

 కాకినాడ పోర్టుకు సమీపంలోనే మడ అడవులు ఉంటాయి.ఈ మడ అడవులు అనేక తుఫాన్ల నుండి ప్రజలను కాపాడినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. మడ అడవుల నరికివేత నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రతినిధి బృందం ఇటీవల కాకినాడలో పర్యటించింది. మడ అడవులు ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొన్నారు. మడ అడవులను నరికివేయవద్దని కోరుతూ స్థానిక అధికారులకు టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు.