అనంతపురం తో పాటు ఇతర కరువు పీడిత రాయలసీమ , తెలంగాణ ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టులకు నీటి లభ్యత చట్టబధ్ధంగా పొందాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాల పునః పంపిణి, రాష్ట్ర విభజన బిల్లులో విస్మరించిన దుమ్మగూడెం - నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టును చేపట్టడం ద్వార శ్రీశైలం ప్రాజక్టు ను సంపూర్తిగ రాయలసీమలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజక్టులకు , దక్షిణ తెలంగాణాలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజక్టులకు వినియోగించు కోవడం తదితర విషయాలపై రాజకీయ పార్టీలు తమకేమాత్రం సంభందం లేని అంశంగా వ్యవహరిస్తున్నాయి.

అనంత కరువు ఇప్పటిది కాదు అంటూనే, శాశ్వత కరువు నివారణ గురించి పాలకులు ఎందుకు ఆలోచించరు ?
తుంగ భధ్ర ఎగువ కాలువకు కేటాయించిన నికర జలాలో 40 శాతం కు మించి నీరు అనంతపురంకు రాకున్నా ఏ రాజకీయ పార్టీకి చీమకుట్టినట్లు లేదు.
రాష్ట్ర విభజన బిల్లులో రాయలసీమ లో నిర్మాణంలో ఉన్న హంద్రీ - నీవా, గాలేరు - నగరి, పాత కర్నూలు జిల్లాలో ఉన్న బేస్తవరి పేట ప్రాంతా వరప్రదాయినైన వెలిగొండ ప్రాజక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నది మిగులు జలాల వాడుకోవడానికి ఉన్న స్వేక్ష ( హక్కు కాదు) ఆదారంగా పై ప్రాజక్టుల నిర్మాణం చేపట్టారు. కొత్తగ ఏర్పాటైన ట్రిబ్యునల్ కృష్ణా నది మిగుల జలాలను మహరాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పంచి వేయడంతో ఈ ప్రాజక్టులకు ఎలాంటి నీటి కేటాయింపుల లేవు. మరి నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజక్టులకు నీటి కేటాయింపులు ఎట్లా అని ఒక్క రాజకీయ పార్టీ కూడ బాద్యతాయుతంగ ఆలోచించడం లేదు.
అనంతపురం ఇతర కరువు పీడిత రాయలసీమ , తెలంగాణ ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టులకు నీటి లభ్యత చట్టబధ్ధంగా పొందాల్సిన అవసరం ఉంది.
కృష్ణా జలాల పునః పంపిణి, రాష్ట్ర విభజన బిల్లులో విస్మరించిన దుమ్మగూడెం - నాగార్జున సాగర్ టైల్ పాండ్ ప్రాజక్టును చేపట్టడం ద్వార శ్రీశైలం ప్రాజక్టు ను సంపూర్తిగ రాయలసీమలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజక్టులకు , దక్షిణ తెలంగాణాలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజక్టులకు వినియోగించు కోవడం తదితర విషయాలపై రాజకీయ పార్టీలు తమకేమాత్రం సంభందం లేని అంశంగా వ్యవహరిస్తున్నాయి.
కేంధ్ర ప్రభుత్వం నుండి కరువు పీడిత ప్రాంతాలలోని సాగునీటి ప్రాజక్టులకు వచ్చె నిధులను పోలవరంకు తరలిస్తున్న ఈ రాజకీయ పార్టీలు పల్లెత్తి మాట కూడ మాట్లాడవు. రాష్ట్ర నిధులు ఈ ప్రాజక్టులకు ఎందుకు కేటాయించరని నిక్కచ్చిగ అడగరు.
క్రింద వివరించిన మౌళిక అంశాలపై రాజకీయ పార్టీలకు అసలు ద్యాసే లేదు.
1. సాంప్రదాయ జల వనరులైన చెరువుల, కుంటల సంరక్షణ, నిర్మాణం నదుల,వంకలతో అను సంధానానికి ప్రత్యేక నిధులతో ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు. అడువుల సంరక్షణ, ఆభివృద్దిని ఈ కమిషన్ లో చేర్చడం.
2. పట్టుసీమ ద్వారా ఆదా అయ్యే నీటిని హంద్రీ నీవాకు చట్టబధ్ధంగ కేటాయించడం. హంద్రీ - నీవాతో చెరువులను అనుసందానం చెయ్యడంతో పాటు నిర్దేశిత ఆయకట్టుకు పంట కాలువలను అభివృద్ది చెయ్యడం.
వీటిని సాధించాలంటే రాజకీయ పార్టీలకు చిత్తసుద్ది ఉండాలి. రాయలసీమ ప్రాజక్టులకు నిదులు ఖర్చు పెట్టకుండ పోలవరం, అమరావతికి తరలించడంలో పాలకపక్షానికి పరోక్షంగ సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీల నిర్వాకంతోనే అనంతపురం పాటు రాయలసీమ జిల్లాల పరిస్థితి నానాటికి దిగజారుతున్నది.
తమ రాజకీయ లబ్దికోశం, చైతన్యవంతమైన కృష్ణా జిల్లా సేవలో ఉన్న రాజకీయ పార్టీలు ,పాము చావకూడదు, కర్ర విరగ కూడదన్నట్టుగ చేస్తున్న కార్యక్రమాలతో రాయలసీమ వాసులు బిక్షగాళ్ళగ మారుతున్నారు (మారుస్తున్నారు)
దానగుణంలో మిన్నైన రాయలసీమ ప్రజలు, నేడు మౌళిక మైన అంశాలపైన కాకుండ పింక్షన్లకు, కరువు పనులకు అడుక్కునే పరిస్థితికి దిగజారడానికి సమాజంలోని అన్ని వ్యవస్థల పాత్ర ఉందన్నది అక్షర సత్యం.
(*రచయిత ‘రాయలసీమ సాగునీటి సాధన సమితి’ కన్వీనర్)
