జగన్ తో భేటీకానున్న ఆనం, నియోజకవర్గంపై స్పష్టత కోసం...

Anam Meets Jagan in Lotus Pond
Highlights

మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి టిడిపి వీడి వైఎస్సార్ సిపి లో చేరతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని ఆనం చక్కబెట్టుకుంటున్నారు. దీంట్లో భాగంగా మరిన్ని విషయాలపై జగన్ నుండి క్లారిటీగా హామీ పొంది వైసీపి తీర్థం పుచ్చుకోవాలని ఆనం భావిప్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన ఇవాళ జగన్ తో భైటీ కానున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రాంనారాయణ రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనాంతరం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన టిడిపిలో చేరారు. అయితే టిడిపిలో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపి నాయకులతో బాగా టచ్ లో ఉండి ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.

ఈ విషయమై ఆనం పలుమార్లు వైసీపి అదినేత జగన్ ను కలవడం జరిగింది.  ఈ సందర్భంగా పలు విషయాలపై సరైన హామీ లభించకపోవడంలో ఆనం ఇంకా టిడిపిలోనే కొనసాగుతున్నారు. అయితే ఇవాళ జరిగే భేటీలో జగన్ నుండి స్పష్టమైన హామీని పొంది పార్టీలో చేరడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉందని  ఆనం సన్నిహితులు చెబుతున్నారు.

ముఖ్యంగా వైఎస్సార్ సిపి లో చేరితే ఏ నియోజకవర్గం నుండి టికెట్ ఇస్తారో ఆనం కు సరైన హామీ లేదు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నుంచే పోటీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇది వైసీపీలో కీలక నేతలుగా కొనసాగుతున్న మేకపాటి కుటుంబంలో పెద్ద దుమారం లేపింది. అయితే ఆత్మకూరు కాకుంటే వెంకటగిరి నుంచి పోటీ చేయాలని ఆనం భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ విషయంపై జగన్ నుండి ఓ స్ఫష్టమైన హామీ పోందాకే వైసీపి తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్న ఆనం అందుకోసమే జగన్ తో సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

loader