తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆనం బ్రదర్స్  పశ్చాత్తాప పడే రోజు  దగ్గర పడిందని అనుకుంటున్నారు

జిల్లాను అభివృద్ధి చేద్దామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుదామని ఆశ గావచ్చిన అనం బృందానికి నిరాశ ఎదురవుతూ ఉంది.

వాళ్ల చొరవకు జిల్లాలో తావు లేకుండా పోతున్నది. దీనితో రచ్చ రచ్చ అయిపోతున్నది. అందువల్ల తెలుగుదేశం పార్టీలో చేరినందుకువారు పశ్చాత్తాప పడే రోజు ఎంతో దూరంలో లేదని నెల్లూరులో జరుగుతున్న పరిణామాలుచూస్తే అర్థమవుతుంది.

అధికార పార్టీలో చేరినందుకు వాళ్లకు ప్రత్యేకంగా వచ్చిన పవరేమీ లేదు. సరికదా, పాలనా వ్యవహారాలలో వారి జోక్యాన్ని నివారించేందుకు,వారి దూకుడు అడ్డుకునేందుకు , అనంబ్రదర్ అండ్ సన్స్ ని ఆత్మకూరు నియోజకవర్గానికే పరిమితం చేయాలని తెలుగుదేశం నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మధ్య జిల్లా పార్టీ ఇన్ చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెల్లూరులో పర్యటించి పార్టీ అధ్యక్షుడికి అందించిన సమాచారం వారికి ఏమాత్రం అనుకూలంగా లేదని తెలిసింది.

ఈ మధ్య నెల్లూరు కార్పొ రేషన్‌ కార్యాలయంలో వద్ద ఆనం వివేకా కుమారుడు హంగామా చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో బుచ్చయ్య చౌదరి ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు చెరిందని చెబుతున్నారు. వీరి పెత్తనం లోకేశ్ కు ఏమాత్రం ఇష్టం లేదని అందువల్లే ఆనంవారిని ఆత్మకూరుని కవర్గానికి పరిమితం చేసేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల కిందట ఆనం వివేకా కుమారుడు రంగమయూర్‌ రెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలో సిబ్బందితో గొడవ పడ్డారు. రుణాలు,పెన్షన్ల వ్యవహారాలు చూసే సూప రింటెండెంట్‌ పై మయూర్‌ రెడ్డి దాడి చేయబోగా అనుచరులు సూపరింటెండెంట్‌ టేబులు మీద ఉండే ఫైళ్లు లాగి విసిరేశారు.

తమకు ఇష్టంలేని వ్యక్తులు చెప్పినా పెన్షన్లు మంజూరు చేస్తున్నారని, దీనికి ఒప్పుకునేది లేదని రెడ్డి హెచ్చరించారు. దీని మీద మేయర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం మీద బుచ్చయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు.ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కొంతమంది బుచ్చయ్య చౌదరికి చాటుగా సిఫార్సు చేశారని చెబుతున్నారు. ఎవరో ఈ సీన్ లను రికార్డు చేసి వీడియో ను బుచ్చయ్య చౌదరికి అందించారని,దానిని ఆయన లోకేశ్ కు చేరవేశారని జిల్లా టిడిపినాయకులలో అనుమమానాలున్నాయి.